GNTR: తెనాలిలో వీధి కుక్కల దాడులు కొనసాగుతున్నాయి. పాండురంగపేట, పినపాడు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేసి పలువురిని తీవ్రంగా గాయపరిచాయి. బుధవారం ఆయా ప్రాంతాల్లో ఐదు లేగ దూడలపై వీధి కుక్కలు దాడి చేసి దారుణంగా కొరికి చంపేశాయి. అటుగా వెళ్తున్న స్కూల్ విద్యార్థులపై కూడా దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.