TPT: రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల విద్యా సంస్థల ఛైర్మన్ తిరుమలరావు, సరోజినిదేవి దంపతులు శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు బుధవారం రూ. 1,01,11,111లు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఛైర్మన్, అదనపు ఈవో అభినందించారు.