కోనసీమ: మండపేట మండల పరిషత్ అధ్యక్షులు ఉండమట్ల శ్రీనివాస్ (వాసు)ను YCP నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రకటించారు. విజయలక్ష్మి నగర్లోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. తల్లి లాంటి పార్టీకి నష్టం చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. పార్టీకి ద్రోహం చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు.