PLD: మాచర్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడొద్దని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం 8 నుండి 11 వార్డుల్లో పర్యటించిన ఆయన, పనుల పురోగతిని పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, ఇతర అధికారులు, నేతలతో కలిసి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.