గల్ఫ్ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా నేతలతో మోదీ మంతనాలు జరిపారు. భారత పౌరుల యోగక్షేమాలపై ఆరా తీశారు. వారి భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఆయా దేశాల్లో చిక్కుకున్న భారత పౌరుల భద్రతపై మోదీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.