AP: తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ అంగన్వాడీలు పట్టుబట్టుకుని కూర్చొన్నారు. తమ డిమాండ్లపై ప్రకటన వచ్చే వరకూ తాము నిరసన కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. దీనిలో భాగంగా వారు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రేపటి వరకు గడువు ఇస్తున్నామని, సమస్య పరిష్కరించకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.