ఇరాన్ తన అమ్ములపొదలోని బ్రహ్మాస్త్రాలను బయటకు తీస్తోంది. ఒక్కో ఆయుధం ఒక్కో ప్రత్యేకత ఉంది కావడమే కాకుండా.. ఎంతో గొప్పగా చెప్పుకునే ఐరన్ డోమ్ని సైతం అవలీలగా చేధించే శక్తి ఉండటంతో ఇజ్రాయెల్ ఆత్మరక్షణలో పడింది. ఇరాన్ వద్ద 3 శక్తిమంతమైన క్షిపణులు ధ్వనివేగం కంటే ఎక్కువ వేగంతో దూసుకెళ్లేవి ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఉపయోగించే పనిలో ఉందని సమాచారం.