CTR: ఇంటర్ ఫలితాలలో కేజీబీవీ విద్యార్థులు సత్తా చాటినట్టు సమగ్ర శిక్ష ఏపిసీ వెంకటరమణ తెలిపారు. ఫస్ట్ ఇయర్లో 97%, సెకండ్ ఇయర్లో 96% మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. రొంపిచర్ల, కుప్పం, గుడిపల్లె, శాంతిపురం, పుంగనూరు కేజీబీవీలో 100% ఫలితాలు నమోదు అయ్యాయి అన్నారు. ఫస్ట్ ఇయర్లో 302 మందికి 292 మంది, సెకండ్ ఇయర్లో 273 మందికి 262 మంది పాసయ్యారు.