VZM: బొబ్బిలి సీఐ కె. నారాయణరావు శుక్రవారం సాయంత్రం స్దానిక ఆకుల రెల్లివీదిలో శక్తి యాప్, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపై మహిళలకు అవగాహన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు స్మార్ట్ ఫోన్లో శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండేలా పిల్లలపై పర్యవేక్షణ చేయాలని కోరారు. సైబర్ నేరాలకు గురికాకుండా జాగ్రత్త పడాలన్నారు.