VSP: నేడు విశాఖ కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా, సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.