PPM: పాచిపెంటలో గల గిరిజన బాలికల మినీ గురుకులంను ఆదివారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు సందర్శించారు. విద్యార్ధులకి అందుతున్న సౌకర్యాలు,సేవలు గురించి ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. వంటకాలను పరిశీలించి రుచి చూశారు. సిబ్బంది బాలల ఆహారం మరియు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనీ నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.