వెలిగండ్ల మండల కేంద్రంలో డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని సోమవారం ఎంపీడీవో గంగాధర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కేలం ఇంద్రభూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.