MDK: మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన పులిచెర్ల మహేష్ (30) అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 22వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహేష్ ఇప్పటివరకు తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి సత్యమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.