TG: స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన MLAలపై స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, వివేకానంద, కల్వకుంట్ల సంజయ్ పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఉన్న 10 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.