KRNL: మండల కేంద్రమైన హొళగుందలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. స్థానిక తేరుబజారులో నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో రాత్రిపూట ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కోతకొచ్చిన పంటలకు కాస్త ఇబ్బందులు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.