ATP: గుత్తి(మం) రజాపురం సమీపంలోని నీటి కుంటలో ఈతకు వెళ్లి ఓ ఆర్మీ జవాన్ మృతి చెందాడు. శ్రీపురం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఆంజనేయులు మంగళవారం సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళాడు. ఈత కొడుతున్న సమయంలో ఊపిరాడక నీటి కుంటలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని బయటికి తీశారు.