అన్నమయ్య: మదనపల్లెలో ఇద్దరు కూలీల మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2018లో గుట్టవారిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, నిందితుడిని దోషిగా తేల్చిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. శుక్రవారం ఈ కేసును 2వ ఏడీజే కోర్టు జడ్జి సూర్యనారాయణ విచారించి తీర్పు వెల్లడించారు.