KKD: అన్నవరం దేవస్థానం కొండ పై ఉన్న షాప్లో MRP కన్నా ఎక్కువ ధరలుకు అమ్ముతూ భక్తులను దోచేస్తున్నారని విశ్వ హైందవ పరిషత్ సభ్యులు లీగల్ మెట్రాలజీ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కొండపైన తనిఖీలు నిర్వహించి MRP కంటే ఎక్కువగా అమ్ముతున్న 2 షాపులపై, ఎటువంటి అనుమతులు లేకుండా వనమూలికలు అమ్ముతున్న ఓ షాప్ పై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.