CTR: పాకాల, ఐరాల మండలాల్లో నిన్న రాత్రి కురిసిన గాలివాన మామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. వడగళ్లతో కూడిన వర్షానికి చేతికొచ్చే దశలో ఉన్న మామిడి కాయలు భారీగా నేలరాలాయి. మరో వారం రోజుల్లో కోతకు సిద్ధమైన పంట నేలపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రాలిన కాయలను వ్యాపారులు కిలో కేవలం రూ.2-3 కే కొనుగోలు చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.