W.G: నరసాపురం అన్నపూర్ణ థియేటర్లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల సందర్భంగా గురువారం కోలాహలం నెలకొంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీకృష్ణ, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.