VZM: ఎల్ కోట మండలం ఖాసాపేట, దాసులపాలెం గ్రామాల్లో మండల వైసీపీ అధ్యక్షులు జీ.సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి, పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో MPP జీ.శ్రీనివాసరావు తదితర వైసీపీ నాయకులు పాల్గొన్నారు.