ATP: అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను కలెక్టర్ ఆనంద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని వేణుగోపాల్ నగర్, గుత్తి రోడ్డు, చెరువుకట్ట తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి శుభ్రతపై ఆరా తీశారు.ఈ తనిఖీల్లో కమిషనర్ జశ్వంత్ రావు కూడా పాల్గొన్నారు.