SDPT: గజ్వేల్ పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీప ప్రాంతం ప్రస్తుతం సమస్యల నిలయంగా మారింది. గత కొంతకాలంగా ఇక్కడ పందుల బెడద విపరీతంగా పెరిగిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్న పందులు రహదారులపై స్వైరవిహారం చేస్తుండటంతో వాహనదారులు, పాదచారులు బెంబేలెత్తిపోతున్నారు.