ప్రకాశం: కంభం మండలంలోని కందులాపురం సమీపంలో గల హౌసింగ్ లేఅవుట్‌ను హౌసింగ్ ఏఈ శివప్రసాద్‌తో కలిసి ఎంపీడీవో వీరభద్రాచారి ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, నిర్మాణాలు వేగవంతం చేసి లబ్ధిదారులకు ఇళ్లను త్వరగా అందించాలని సూచించారు. పనుల్లో నాణ్యతతో పాటు వేగం కూడా ముఖ్యమని ఎంపీడీవో తెలిపారు.