ATP: గుత్తిలోని జెండా వీధిలో మంగళవారం రాత్రి ఇరువర్గాలు ఓ చిన్న విషయానికి మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో ఒక వర్గం మరో వర్గంపై రాళ్లతో దాడి చేసింది. ఈ దాడిలో షరీఫ్, దాదా పీర్ అనే యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.