కోనసీమ: పి. గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామానికి చెందిన వేమన కిరణ్ కుమార్(నాని) కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన వైద్యం నిమిత్తం లంకల గన్నవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థులు రూ.10,000 సేకరించి శనివారం నానికి అందజేశారు. విద్యార్థుల ఔదార్యాన్ని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. ఈ సాయం పట్ల బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.