NTR: రోజురోజుకి పెరుగుతున్న CNG గ్యాస్ ధరల నేపథ్యంలో విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఇవాళ రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ గడియార స్తంభం వద్ద ధర్నా నిర్వహించారు. ధరలకు హద్దే లేదా, ఏలే వాడికి బుద్ధి లేదా, పెరిగిన CNG గ్యాస్ ధరలు ఉపసంహరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గ్యాస్ ధరలు పెరిగిపోవటంతో ఆటో కిరాయి అద్దె కట్టలేకపోతున్నామన్నారు.