ELR: దెందులూరు మండలం గుడిగుంట గ్రామంలో వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమం నిర్వహించారు. గుడిగుంట గ్రామ పరిధిలోని జోగన్నపాలెం స్వర్ణ గ్రామ సచివాలయంలో ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు జెసి అభిషేక్ గౌడ హాజరయ్యారు. ప్రజల నుంచి రెవెన్యూ సంబంధిత సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారం కొరకు అర్జీలను స్వీకరించారు.