VSP: విశాఖ హరే కృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకులు ప్రభుపాదుల వారి 129వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖలోని గంభీరం హరే కృష్ణ వైకుంఠంలో ఆదివారం శ్రీ వ్యాసపూజ సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు తమ ఇళ్లలో 3,930 రకాల వంటకాలను తయారు చేసి, వాటిని రాధా మదన మోహన్ మందిరంలో శ్రీల ప్రభుపాదుల వారికి గురుదక్షిణగా సమర్పించారు.