CTR: చిత్తూరు నగరంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. మహాత్మ జ్యోతిరావు ఫూలే భవనంలో రూ. 53 లక్షలతో నిర్మించిన అదనపు వసతి గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.