TPT: తడలో నిన్న జరిగిన ప్రమాదంలో పెరియవట్టు మాజీ సర్పంచ్ శిల్వి (48) మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. బ్యాంకు పనినిమిత్తం కుమారుడితో కలిసి బైకుపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పూడి వద్దకు రాగానే చీరకొంగు బైకు చక్రంలో ఇరుక్కోవడంతో ఆమె కిందపడిపోయింది. తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం చెన్నైకి తీసుకెళ్తుండగా మార్గమధ్య లో ఆమె ప్రాణాలు కోల్పోయింది.