సత్యసాయి: సోమందేపల్లి మండలం చాకర్లపల్లిలో చిరుత సంచారం అంటూ వీడియో వైరల్ కావడంతో అటవీశాఖ అధికారులు ఆదివారం స్పందించారు. గోవింద రెడ్డి కోళ్ల ఫారంలో కనిపించింది చిరుత కాదు, సాధారణ అడవి పిల్లి మాత్రమేనని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కుళ్లాయప్ప స్పష్టం చేశారు. కోళ్ల ఫారం వద్ద పరిశీలించి నిర్ధారించామని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.