AKP: నక్కపల్లి మండలం ఉద్దండపురం వద్ద రూ.280 కోట్లతో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టును పూర్తిచేసి 152 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చాలని సీపీఎం నక్కపల్లి మండలం కార్యదర్శి ఎం రాజేష్ డిమాండ్ చేశారు. నక్కపల్లిలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందన్నారు. 2017లో అప్పటి పంచాయతీ రాజ్ మంత్రి లోకేష్ దీనిని ప్రారంభించారన్నారు.