PPM: ఎల్విన్‌పేట చెక్‌పోస్ట్ వద్ద సోమవారం ఎస్ఐ శివప్రసాద్ తన సిబ్బందితో కలిసి వాహనాలపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణాను అరికట్టే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలను పరిశీలించి, నిబంధనలు పాటించని వాహనదారులకు చలానాలు విధించారు.