PPM: 3,4,5వ తరగతులు గల ప్రాథమిక పాఠశాల నుంచి ప్రైమరీ పాఠశాలకు తరగతుల విద్యార్థులను విలీనం చేయటం వలనవిద్యా వ్యవస్థ కుంటుపడుతోందని ట్రైబుల్ రైట్స్ ఫారం అధ్యక్షులు ఇంటికుప్పల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఎలిమెంటరీ స్కూల్ లేకపోతే విద్యార్థులు చదువుకు దూరమవుతారు అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వము వెనక్కి తీసుకోవాలి అన్నారు.