అన్నమయ్య: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్‌కు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలని, శాస్త్రాన్ని దైనందిన జీవితంలో అన్వయించుకోవాలని సూచించారు. ఉత్తమ ప్రదర్శనలు కనబరిచిన విద్యార్థులను అభినందించారు.