ELR: ప్రజా ప్రయోజనాలు, ఇంధన పొదుపు దృష్ట్యా టీడీపీ అధిష్ఠానం ఈ ఏడాది మహానాడును ఆన్లైన్లో నిర్వహిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఆన్లైన్ వేదికగా జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో 11 క్లస్టర్ల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలంతా చురుగ్గా పాల్గొనాలని కోరారు.