NLR: కోవూరు మండలం పాటూరు-గుమ్మళ్లదిబ్బ చేనేత క్లస్టర్ ద్వారా చేనేత కార్మికులకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆదివారం చేనేత ఉపకరణాలను అందజేశారు. క్లస్టర్ పరిధిలోని 175 మందికి కార్మికులకు గాను మొదటి విడతలో 85 మందికి మగ్గం, రాట్నం, జాకార్డ్ మిషన్, లిఫ్ట్ మిషన్ వంటి ఉపకరణాలు, 25 మందికి రూ.25 లక్షల ముద్రా రుణాల చెక్కును అందజేశారు.