NLR: మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌ను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ బుధవారం కందుకూరులో కలిశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం కందుకూరు వచ్చిన జూపూడి వైసీపీ కార్యాలయానికి వెళ్ళి బుర్రాను కలిశారు. స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాజీ AMC ఛైర్మన్ తోకల కొండయ్య, దళిత నాయకులు పాల్గొన్నారు.