VSP: నగరంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో నిన్న సాయంత్రం వరకు జరిపిన చర్చలు విఫలమవ్వడంతో శుక్రవారం కార్మికులు సమ్మెకు ఉపక్రమించారు. ఉదయం 6 గంటల షిఫ్ట్‌కు కాంట్రాక్ట్ కార్మికులు హాజరుకాలేదు. కార్మిక సంఘాలు పిలుపు మేరకు 24 గంటల పాటు సమ్మె చేయనున్నారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులు తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.