SKLM: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 1600 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మరో వారం రోజుల్లో 3 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు పేర్కొన్నారు.