E.G: CPM తూ.గో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కొవ్వూరు సబ్ డివిజన్ DSP దేవ కుమార్‌కి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు.