కోనసీమ: అల్లవరం మండలం కోడూరుపాడు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను కారు ఢీ కొనడంతో రెళ్ళుగడ్డకు చెందిన సూర్య నారాయణ రాజు(52), విశాఖకు చెందిన శ్రీనివాసరావు(47) మృతి చెందారు. వీరు బైక్పై అల్లవరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సై సంపత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.