కడప: బ్రహ్మంగారిమఠం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహించు నిత్య అన్నదానంకు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీనివాసన్ లక్ష రూపాయలు ఇచ్చినట్లు ఆలయ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ, మేనేజర్ ఈశ్వరయ్య చారి తెలిపారు. ఎవరైనా విరాళం ఇచ్చువారు ఆలయ కార్యాలయంలో సంప్రదించి రశీదు తీసుకోవాలన్నారు.