అన్నమయ్య: రామసముద్రం నుంచి శుక్రవారం వేకువజామున మదనపల్లెకు వెళ్తున్న బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు పెంచుపాడు డౌన్లో 5.30కి అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.