NLR: కలువాయి మండలం BVNR జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మండల స్టాక్ పాయింట్‌ను జిల్లా సమగ్ర శిక్ష విద్యా పర్యవేక్షణ అధికారి జి. సుధీర్ బాబు, జిల్లా సహిత విద్య కోఆర్డినేటర్ శ్రీనివాసరావు సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందించే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్ల నిల్వ, భద్రపరిచే విధానాన్ని పరిశీలించారు.