PPM: వార్షిక తనిఖీల్లో భాగంగా మన్యం జిల్లాలో ఉన్న పలు పోలీసు స్టేషన్లను విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి తనిఖీలు చేశారు. ముందుగా ఆయనకు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ఎఎస్పీ మనీషా రెడ్డి పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ పరిసరాలను పరిశీలించి, రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతను పరిరక్షించే క్రమంలో పోలీసులు ముందుండాలని సూచించారు.