SKLM: మెలియాపుట్టి విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. మామిడిగుడ్డి గ్రామానికి చెందిన ధర్నారావు, శ్రీకాంత్ ఒక బైక్పై, దిలీప్ మరో బైక్పై మెలియాపుట్టి వైపు వస్తుండగా రెండు బైక్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ధర్నారావు తీవ్రంగా గాయపడగా, 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.