ATP: CM చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 20న కళ్యాణదుర్గంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించిన సందర్భంగా ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. రక్తదానం చేసే ప్రతి దాతకు రూ. 3 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు వెల్లడించారు.