SS: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ వైట్‌ఫీల్డ్ నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థినులు ప్రశాంతి నిలయంలో ‘గోపికా గీతం’ పేరిట భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థినులు వేద పఠనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ భాషల భక్తి గీతాలు, భజనలతో అలరించారు.